కొద్ది రోజుల క్రితం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – స్టైలిష్ స్టార్ అల్లు ఆర్జున్ సినిమా కోసం సమంతని హీరోయిన్ గా అనుకుంటున్నారని తెలిపాము. ఫైనల్ గా సమంత కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటికే త్రివిక్రమ్ – సమంత, త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
తన మాటలతో మాయ చేసి థియేటర్లో ప్రేక్షకులని కట్టి పారేయగల డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాగే తన చూపులతో, గ్లామర్ తో ప్రేక్షకులని కట్టి పడేసే హీరోయిన్ సమంత. తన స్టైలిష్ లుక్, డాన్సులతో అమితంగా ఆకట్టుకునే హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రేక్షకుల్లో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వీరి ముగ్గిరి కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు బాగా ఎక్కువగా ఉంటాయి.
ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేయనున్నాడు. అలాగే అల్లు అర్జున్ ప్రస్తుతం రేసు గుర్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.