తమిళ్ టాప్ హీరో సినిమాకి సైన్ చేసిన సమంత!

తమిళ్ టాప్ హీరో సినిమాకి సైన్ చేసిన సమంత!

Published on Sep 26, 2013 5:50 PM IST

Samantha-in-saree
ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న క్రేజీ హీరోయిన్ సమంత అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. సమంత స్వతహాగా తమిళ భామ అయినప్పటికీ తమిళంలో ఎక్కువ అవకాశాలను చేజిక్కించుకోలేకపోయింది. అందుకోసమే ఇక నుంచి తమిళంలో కూడా సినిమాలు చేయాలని చూస్తున్నానని సమంత కొద్ది రోజుల క్రితం తెలిపింది. అనుకున్నట్లుగానే సమంత ప్రస్తుతం తమిళ్ టాప్ హీరోల సినిమాల్లో చాన్స్ దక్కించుకుంటోంది.

ఇప్పటికే సూర్య – లింగుస్వామి డైరెక్షన్లో తెరకెక్కనున్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత తాజా తమిళ్ టాప్ హీరో విజయ్ – ఎఆర్ మురుగదాస్ కాంబినేషన్లో మొదలు కానున్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా 2014 జనవరిలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. దీన్నిబట్టి చూస్తుంటే సమంత అనుకున్నట్లుగానే తన మాతృ భాషలో క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటోంది.

తెలుగులో సమంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు