మరో పెద్ద కంపనీకి ప్రచారకర్తగా మారిన సమంత

మరో పెద్ద కంపనీకి ప్రచారకర్తగా మారిన సమంత

Published on Mar 16, 2014 9:30 AM IST

samantha
గతంలో డాబర్ వాటికా, లక్స్ మరియు కొన్ని ప్రముఖ శారీ కంపనీలకు ప్రచారకర్తగా వ్యవహరించిన సమంత ఇప్పుడు మరో కంపనీని తన లిస్టులోకి చేర్చింది. ఈసారి ఆ అవకాశం ప్రముఖ పాదరక్షల కంపనీ పారగాన్ కు దక్కింది

ఈ వార్తను సమంత ట్విట్టర్ లో అధికారికంగా ధృవీకరించింది. పారగాన్ సంస్థతో కలిసి పనిచెయ్యడం చాలా ఆనందంగా వుందని, చెన్నై లో యాడ్ ల షూటింగ్ జరుగుతుందని తెలిపింది. ఈ నెలలో సమంత శెలవులకు లండన్ వెళ్ళిన సంగతి మనకు తెలిసినదే. ఇప్పుడు రభస సినిమాలో తిరిగి షూటింగ్ లో పాల్గుంటుంది

ఇదేకాక వి.వి వినాయక్, సూర్య – మురగదాస్ ల చిత్రాల షూటింగ్ లు వివిధ దశలలో వున్నాయి. ఈ వేసవిలో అక్కినేని మల్టీ స్టారర్ ‘మనం’ సినిమాలో సమంత ను తెరపై చూడచ్చు

తాజా వార్తలు