ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రీకరణలో పాల్గొంటున్న సమంత


తన రాబోతున్న ద్విభాషా చిత్రం “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రీకరణలో సమంత పాల్గొంటుంది గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రానికి డబ్బింగ్ చెప్పిన సమంత చాలా వరకు డబ్బింగ్ పూర్తి చేసింది. గౌతం మీనన్ దర్శకత్వం వహిస్తున్న “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రీకరణలో పాల్గొనడానికి నిన్న చెన్నై వెళ్ళింది. ఈ చిత్ర తెలుగు వెర్షన్ నాని ప్రధాన పాత్ర పోషిస్తుండగా తమిళంలో జీవ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 14న విడుదల చెయ్యాలని గౌతం మీనన్ నిర్ణయించుకున్నారు. మరి కొద్ది రోజుల్లో చిత్రంలో మిగిలిన ప్యాచ్ వర్క్ పూర్తి చెయ్యనున్నారు ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించారు తెలుగు వెర్షన్ చిత్రానికి సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించారు.

Exit mobile version