పుకార్లతో విసిగిపోతున్న సమంత

పుకార్లతో విసిగిపోతున్న సమంత

Published on Nov 23, 2013 2:00 AM IST

Samantha

లేనిపోనీ పుకార్లను సృష్టించడంలో మనకు మనమే సాటి. అందునా అగ్రతరాలకు ఇది తప్పని పరిపాటి. వారి ప్రాజెక్టుల దగ్గరనుండి వ్యక్తిగత వివరాల వరకూ అన్నీ కావాలి మనకి.

యువకుల హృదయాన్ని దోచిన తార సమంత పై ఈ పుకార్లు కాస్త ఎక్కువ. లేనిపోని వార్తలను ఆమె ఇంటర్వ్యూల రూపంలో చాలా పత్రికలు/ మీడియా వర్గాలూ ప్రచురిస్తున్నాయి. దీనితో విసిగిపోయిన సమంత “నాకు ఈ పుకార్లకు చిరాకు వస్తుంది. నేను ఎప్పుడూ ఇవ్వని ఇంటర్వ్యూలు నా పేరుపై ప్రచురించడం ఆశ్చర్యకరం. ఇకపై నేను ట్విట్టర్ లో పెడితే తప్ప మిగిలినవి నామాటలుగా పరిగణించకండి” అని తెలిపింది.

ప్రస్తుతం ఈ భామ కూర్గ్ లో ‘మనం’, ముంబైలో సూర్య సరసన నటిస్తున్న తమిళ సినిమా షూటింగ్ లలో బిజీగా వుంది.

తాజా వార్తలు