సమంత స్పాట్ లో సీన్స్ ని ఇంప్రవైజ్ చేసింది – త్రివిక్రమ్

సమంత స్పాట్ లో సీన్స్ ని ఇంప్రవైజ్ చేసింది – త్రివిక్రమ్

Published on Sep 30, 2013 8:30 AM IST

trivikram-srinivas
అందాల భామ సమంత ఒక గోల్డెన్ లెగ్ గానే కాకుండా మంచి నటి మరియు తను హీరోలతో చేసే సీన్స్ అన్ని చాలా బాగా వస్తాయి. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్ – సమంత మధ్య వచ్చే సీన్స్ చాలా సూపర్బ్ గా వచ్చాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. మాములుగా ఇలాంటి సీన్స్ బాగా వచ్చినప్పుడు అంత బాగా చేయించుకున్నందుకు డైరెక్టర్ కి క్రెడిట్ ఇస్తాము. కానీ ఇదే విషయాని త్రివిక్రమ్ ని అడిగితే ఆయన ఇంకోలా సమాధానం ఇచ్చారు.

ఇటీవలే సమంత, త్రివిక్రమ్ ఓ ప్రముఖ టీవీ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ షోలో త్రివిక్రమ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. ‘సెకండాఫ్ లో సమంత పవన్ దగ్గరికి వెళ్లి ఓ ముద్దు పెట్టి బావా అని పిలవాలి. కానీ సమంత సెట్ లో అక్కడికక్కడ ఇంప్రవైజ్ చేసి నేను చెప్పిన దానికన్నా ఎక్కువ చేసింది. నేను కట్ చెప్పకుండా అలా చూస్తుండిపోయాను. ఆ సీన్ చాలా బాగా వచ్చిందని’ త్రివిక్రమ్ అన్నాడు. ఇలానే సమంతతో పనిచేసిన ప్రతి ఒక్క డైరెక్టర్ తన గురించి కొన్ని మంచి మంచి విషయాలను చెబుతుంటారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు