రెండు నెలలు ఫాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్న సమంత

రెండు నెలలు ఫాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్న సమంత

Published on Oct 9, 2012 2:45 PM IST


అందాల భామ సమంత ‘ ఏ మాయ చేసావే’ సినిమా ద్వారా తెలుగు వారిని ఏమ్మాయ చేసిందో గానీ యువత అంతా తమ కలల రాకుమారిగా ఊహించుకొని వెర్రెక్కి పోతున్నారు. అలాంటి సమంత అభిమానులు కొంత కాలంగా తన సినిమా ఏదీ లేదని తెగ బాధపడిపోతున్నారు. అలాంటి వారికి ఇదో శుభవార్త. సమంత నటించిన నాలుగు తెలుగు సినిమాలు మరియు ఒక తమిళ సినిమా రెండు నెలల గ్యాప్ లోనే వరుసబెట్టి విడుదల కానుండడం విశేషం. అందులో జీవా సరసన చేసిన తమిళ సినిమా ‘నీతానే ఎన్ పొన్వసంతం’ మరియు ‘ఈగ’ తర్వాత మరోసారి నానితో కలిసి చేసిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ చిత్రాలు నవంబర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ తర్వాత నాగ చైతన్య సరసన,సమంత మొదటిసారి మాస్ పాత్రలో నటించిన ‘ఆటోనగర్ సూర్య’ , వెంకీ – మహేష్ కాంబినేషన్లో వస్తున్న టాలీవుడ్ క్రేజీ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మరియు నందిని రెడ్డి డైరెక్షన్లో సిద్దార్థ్ – సమంత జంటగా తెరకెక్కుతున్న సినిమా, ఇలా వరుసగా ఒక దాని తర్వాత ఒకటి ఈ మూడు సినిమాలు డిసెంబర్లో విడుదల కానున్నాయి. ఇది సమంత అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ నవంబర్ నుండి సమంత ఇచ్చే ట్రీట్ కోసం రెడీ అయిపోండి. ఈ ఐదు సినిమాలతో సమంత తన అభిమానుల దాహాన్ని పూర్తిగానే తీరుస్తుందని ఆశిద్దాం.

తాజా వార్తలు