సమంత ఖాతాలో మరో బ్రాండ్

సమంత ఖాతాలో మరో బ్రాండ్

Published on Nov 20, 2012 12:08 PM IST


చెన్నై ముద్దుగుమ్మ సమంత మరో బ్రాండ్ కి ప్రచార కర్తగా చేయడానికి అంగీకరించారు. ఇక నుంచి సమంత డాబర్ వాటిక ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్. ఈ విషయాన్ని సమంత స్వయంగా తెలిపారు ‘ డాబర్ వాటిక వారితో ఒప్పందం కుదిరింది. డాబర్ టీంలో నేను ఒక భాగమవ్వడం ఆనదంగా ఉందని’ సమంత ట్వీట్ చేసింది. ఇప్పటికే సమంత బిగ్ సి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మొదలైన వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం సమంత తెలుగు మరియు తమిళ సినిమాల షూటింగ్లతో బిజీ బిజీగా ఉన్నారు. త్వరలోనే డాబర్ ప్రోడక్ట్ కి సమంత చేసే కమర్షియల్ యాడ్ ని చూడవచ్చు.

తాజా వార్తలు