ప్రస్తుతం కరోనా భయం మన తెలుగు ఇండస్ట్రీ వరకు కూడా చేరింది. గత కొన్ని రోజుల కితమే ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా వచ్చిందన్న వార్త సినీ వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఇక ఇదే అనుకుంటే ప్రముఖ నటి శిల్పా రెడ్డి తన భర్తకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పగా సినీ వర్గాలు ఆశ్చర్యపోయాయి.
కానీ ఇప్పుడు ఆయన కోలుకుంటుండగా..ఆమెకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ముద్దు పెట్టుకుంది. కానీ ఆ తర్వాత ఆమెకు అసలు విషయం తెలుసుకొనేసరికి అప్పటికే ఆ వార్త సినీ వర్గాల్లో వైరల్ అయ్యిపోయింది.
దీనితో సమంత మరియు నాగ చైతన్యలు డేంజర్ లో ఉన్నారని పలు వార్తలు వినిపించాయి. కానీ వారు కరోనా టెస్టులు చేయించుకోగా వారికి ఎలాంటి ప్రమాదమూ లేదని నిర్ధారణ అయ్యినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా వారికి ఏ ఇతర ఆరోగ్య సమస్యలు కూడా లేవని ఒక క్లారిటీ ఇప్పుడు బయటకు వచ్చింది.