‘ఏ మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ మారిపోయి.. పెళ్లయ్యాక కూడా వరుస హిట్స్ తో ఇంకా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతుంది. కాగా నేడు సమంత పుట్టినరోజు. కాగా ఈ పుట్టినరోజు నాడు సమంత కొత్త నిర్ణయం తీసుకుందట. ఇక నుండి సోషల్ సర్వీసెస్ ను పెద్ద ఎత్తున చేయాలకుటుందట.
అలాగే ఈ సంవత్సరం ఓ సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టి కథాబలం ఉన్న సినిమాలను తీయాలని అదేవిధంగా కొత్తవారికీ అవకాశాలు కల్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి అన్నపూర్ణ బ్యానర్ లో కాకుండా సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టి దాని మీదే సమంత సినిమాలను నిర్మించడానికి కారణం ఆడవాళ్ళకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే సమంత నిర్మించాలనుకుంటున్నారట.
పైగా ఇప్పటికే ఓ బేబీ సినిమాతో సోలోగా మంచి సక్సెస్ ని అందుకున్న సమంత భవిష్యత్తులో కూడా అలాంటి కొత్త కథల పైనే దృష్టి పెట్టబోతోందట.