బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి 59 ఏళ్ల వయసు. ఇంత వయసు వచ్చినా ఆయన పెళ్లి చేసుకోలేదు. ఈ అంశం పై తాజాగా ఆయన స్పందించారు. సల్మాన్ తన ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ.. ‘నేను ‘ఏవీ మాల్ఫోర్మేషన్’ ‘బ్రెయిన్ ఎన్యోరిజమ్’తో ఇబ్బందిపడుతున్నాను. ఒక నటుడిగా ఈ రంగంలో రాణించాలంటే మనమెంతో కష్టపడాల్సి ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తున్నప్పుడు తరచూ గాయాలు అవుతుంటాయి. వీటికి తోడు నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి’ అని సల్మాన్ తెలిపారు.
తాను ట్రైజెమినల్ న్యూరల్జియా, బ్రెయిన్ ఎన్యోరిజమ్ లతో బాధ పడుతున్నట్లు ఆయన చెప్పారు. ఎన్ని ఇబ్బందులున్నా వృత్తిపరంగా కాస్త విరామం తీసుకోవాలనే ఉద్దేశం మాత్రం నాకు లేదు. వీటితోనే జీవితాన్ని కొనసాగిస్తున్నా. ఇందులో భాగంగానే పెళ్లికి దూరంగా ఉన్నాను. జీవితంలో నటన పరంగా నాకు సంతృప్తి ఉంది. కుటుంబం పరంగా కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.