‘సూర్య’ స్టంట్స్ పై క్రేజీ అప్ డేట్

‘సూర్య’ స్టంట్స్ పై క్రేజీ అప్ డేట్

Published on Jun 22, 2025 7:00 AM IST

తమిళ స్టార్ హీరో సూర్య – వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. కాగా వచ్చే వారం నుంచి ఓ ప్రత్యేక సెట్ లో సూర్య పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారట. అందుకోసం, ‘గుంటూరు కారం హౌస్’ సెట్ లో ఓ ప్రత్యేక సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. సినిమా మొత్తానికే ఈ సన్నివేశాలు మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా సూర్య స్టంట్స్ చాలా బాగుంటాయట.

అన్నట్టు ఇప్పటికే, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, సూర్య సినిమాకు వెంకీతో కలిసి మ్యూజిక్ పనులు కూడా మొదలు పెట్టాడు. ఈ సినిమాకు హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ప్లాన్ లో ఉన్నారని మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి గ్లామరస్ బ్యూటీ ‘కాయదు లోహర్’ను తీసుకోబోతున్నారని టాక్ నడిచింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు