వై వి ఎస్ చౌదరి సాయి ధరం తేజ్ ని పరిచయం చేస్తూ చేస్తున్న చిత్రం “రేయ్”. ఈ చిత్రం మొదలయినప్పటి నుండి చాలా అడ్డంకులు ఎదుర్కొంది.చిరంజీవి అల్లుడుని పరిచయం చేస్తూ మొదలయిన ఈ చిత్రంలో కథానాయికలుగా శుబ్రా అయ్యప్ప మరియు అమృత పట్కి నటించాల్సి ఉండగా. కొద్ది రోజుల తరువాత అమృత పట్కి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగా తన స్థానాన్ని వై వి ఎస్ చౌదరి శ్రద్ద దాస్ తో బర్తీ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నుండి శుబ్రా అయ్యప్ప కూడా తప్పుకున్నట్టు తెలుస్తుంది.ఇందువలన వై వి ఎస్ చౌదరి శుబ్రా అయ్యప్ప స్థానంలో నూతన నటి సైయామి ఖేర్ ని ఎంపిక చేసుకున్నారు. ముంబై కి చెందిన ఈ మోడల్ కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో ఒక ఫోటో కి పోజ్ ఇచ్చింది ఇదే కాకుండా పాంటాలూన్స్ మరియు రేమాండ్స్ వంటి యాడ్స్ లో కనిపించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ భామ ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ హిందీలో కాకుండా తెలుగులో పరిచయం కావటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. వై వి ఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి చక్రి సంగీతం అందిస్తున్నారు.
“రేయ్” చిత్రంలో శుబ్రా అయ్యప్ప స్థానంలో సైయామి ఖేర్
“రేయ్” చిత్రంలో శుబ్రా అయ్యప్ప స్థానంలో సైయామి ఖేర్
Published on Apr 7, 2012 9:55 AM IST
సంబంధిత సమాచారం
- ఐసీసీ నిర్ణయం హాట్‌టాపిక్: బెంగళూరు అవుట్, నవి ముంబై ఇన్
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- ‘మన వరప్రసాద్ గారు’ బ్యాక్ డ్రాప్ రివీల్ చేసిన దర్శకుడు!
- ఎమోషనల్ వీడియో: నాన్న మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన గ్లోబల్ స్టార్
- భవిష్యత్ కెప్టెన్లపై బీసీసీఐ దృష్టి: టీమిండియా కొత్త నాయకులు వీరేనా?
- మెగా 157: ఇంట్రెస్టింగ్ టైటిల్, మెగా స్వాగ్ తో అదిరిన గ్లింప్స్.. కానీ
- పవన్ స్పెషల్ విషెస్ కి చిరు అంతే స్పెషల్ రిప్లై!
- విశ్వంభర: మొత్తానికి పోయిందంతా వెనక్కి!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్‌పై మీ అభిప్రాయం..?
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్‌తోనే రికార్డులు పటాపంచలు
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్‌ను దక్కించుకున్నది వీరే..!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- పవన్ స్పెషల్ విషెస్ కి చిరు అంతే స్పెషల్ రిప్లై!