‘సాయి పల్లవి’ బికినీలోనా ?.. నిజమేనా ?

Sai-pallavi

సౌత్ ‘నేచురల్‌ బ్యూటీ’గా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. న‌టనతో పాటు తెలుగింటి ఆడపిల్లలా సాయి పల్లవి ప్రేక్షకులను కట్టిపడేసింది. పైగా ఆమెకు తెలుగులో లేడీ పవర్‌ స్టార్‌ అనే రేంజ్‌లో ఫాలోయింగ్ వచ్చింది. దీనికితోడు ఆమె బోల్డ్ సీన్స్ కి దూరంగా ఉంటుంది. ఐతే, ఇలాంటి సాయి పల్లవి ఉన్నట్టు ఉండి బికినీలో దర్శనమివ్వడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసలు ఈ బికినీ ఫోటోలు నిజమేనా ? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పైగా సాయి పల్లవి ఇంతవరకు ఎప్పుడూ ఇలా కనిపించలేదు. ఆ రేంజ్ లో దర్శనం ఇచ్చింది.

సాయి పల్లవిని ఇలాంటి బోల్డ్‌ అవతారంలో చూడని ప్రేక్షకులు సైతం ఇవి ఫేక్ ఫోటోస్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. మరోవైపు మాత్రం సాయి పల్లవి బికినీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఫోటోల విషయానికి వస్తే.. తన చెల్లెలు పూజా కన్నన్‌తో కలిసి విదేశాల్లో వెకేషన్ కి వెళ్ళింది సాయి పల్లవి. అక్కడ సముద్ర తీరంలో సాయి పల్లవి బికినీలో కనిపించింది. ‘సాయి పల్లవి బికినీలోనా ?, ఏంటి నిజమేనా ?’ అంటూ ఆమె ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. సాయిపల్లవి ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతోన్న ‘రామాయణ’లో సీతగా కనిపించబోతుంది.

Exit mobile version