‘ఓజీ’లో ఆయన కూడా.. కానీ, లేపేశారట..!

Rahul-Ravindran
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ ఓజీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా, దాన్ని ఫాలో అవుతూ నెట్టింట సందడి చేస్తున్నారు. ఇక ఓజీ చిత్రంలో భారీ క్యాస్టింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రముఖ నటుడు కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా నటిస్తున్నాడు.

ఓజీ ట్రైలర్‌ను పరిశీలిస్తే, ఓ ఫ్రేమ్‌లో ప్రకాశ్ రాజ్ పక్కన రాహుల్ రవీంద్రన్ కనిపిస్తాడు. ఇదే విషయాన్ని ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు. రాహుల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారా..? అని అభిమాని ప్రశ్నించగా.. దానికి ఆయన సమాధానం ఇచ్చారు. ఓజీ చిత్రంలో ఓ చక్కటి పాత్రలో నటించానని.. అయితే, ఫైనల్ ఎడిటింగ్‌లో ఆ పాత్రను తొలగించారని ఆయన చెప్పుకొచ్చారు.

దర్శకుడి నిర్ణయానికి తాను ఎప్పుడూ ఓకే చెబుతానని.. అయినా, ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి ఓజీ ఫీవర్‌తో ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

Exit mobile version