థియేటర్‌/ఓటీటీ’ : ఈ వారం భారీ చిత్రంతో పాటు క్రేజీ కంటెంట్ ఇదే !


సెప్టెంబర్ నాలుగో వారంలో వినోదాల విందును పంచడానికి భారీ చిత్రం రాబోతుంది. ‘ఓజీ’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

మోహన్‌లాల్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘హృదయపూర్వం’. ‘జియో హాట్‌స్టార్‌’లో ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నారా రోహిత్‌ హీరోగా తెరకెక్కిన ‘సుందరకాండ’ ఈ నెల 23 నుంచి ‘జియో హాట్‌స్టార్‌’లో స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ :

ది గెస్ట్‌ (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌ సెప్టెంబరు 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అలైస్‌ (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌ సెప్టెంబరు 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మాంటిస్‌ (మూవీ) ఇంగ్లీష్‌ సెప్టెంబరు 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హౌస్‌ ఆఫ్‌ గిన్నీస్‌ (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్‌ సెప్టెంబరు 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో హాట్‌స్టార్‌

తల్సా కింగ్‌ (మూవీ) హిందీ సెప్టెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది డెవిల్‌ ఈజ్‌ బిజీ (డాక్యుమెంటరీ) సెప్టెంబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మార్వెల్‌ జాంబియాస్‌ (మూవీ) సెప్టెంబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Exit mobile version