చిరు@47.. ఎమోషనల్ నోట్‌తో అన్నయ్య ప్రస్థానాన్ని గుర్తుచేసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Heartfelt Note On Chiranjeevi Completing 47 Years In Cinema anl

మెగాస్టార్ చిరంజీవి తన సినీ ప్రస్థానం మొదలుపెట్టి 47 సంవత్సరాలు పూర్తయింది. ఈ ప్రయాణంలో అభిమానుల ప్రేమ, ఆశీర్వాదాలు తనకు దక్కడం తాను జీవితాంతం వారికి రుణపడి ఉంటానని చిరు ఈ సందర్భంగా తెలిపారు. ఇక తన అన్నయ్య 47 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకోవడంపై తాజాగా ఆయన తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు.

‘‘ప్రాణం ఖరీదు’ సినిమాలో పెద్ద అన్నయ్య హీరోగా నటించిన రోజును తాను ఇంకా స్పష్టంగా గుర్తుంచుకున్నాను. ఆ సమయంలో మేము నెల్లూరులో ఉండేవాళ్లం. నేను స్కూల్‌లో చదువుతుండగా, కనకమహల్ థియేటర్‌కి వెళ్లి సినిమా చూసాం. ఆ రోజు నాకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. 47 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన ప్రతి దశలోనూ అద్భుతమైన ఎదుగుదల సాధించారు. కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా, ఒదిగే ఉన్నారు. సాయం చేయడం, ప్రోత్సహించడం ఆయన సహజ స్వభావం.

దుర్గామాత కటాక్షంతో చిరంజీవి గారికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా మరెన్నో విభిన్నమైన పాత్రల్లో ఆయనను చూడాలని ఆశిస్తున్నాం. రిటైర్మెంట్ అనేది ఆయనకు లేని మాటే. ఆయన ఇష్టపడితే తప్ప, ఆయన ఆగరు. పుట్టుకతోనే ఫైటర్ మా శంకర్ బాబు అలియాస్ మన మెగాస్టార్ చిరంజీవి.’’ అంటూ పవన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Exit mobile version