మహేష్ బాబుతో సందీప్ రెడ్డి చిత్రం.. లేనట్టేనా..?

sandeep-reddy-vanga-m

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB29 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. RRR తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడం, అలాగే మహేష్‌తో ఆయన మొదటి కాంబినేషన్ కావడం వల్ల ఈ సినిమాపై విపరీతమైన హైప్ నెలకొంది.

ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా, మహేష్ బాబు – సందీప్ వంగా కాంబినేషన్‌లో ఓ యాక్షన్ సినిమా వస్తుందన్న వార్తలు గతకొంత కాలంగా హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ స్పందిస్తూ .. “అలాంటి ప్రాజెక్ట్ ఏదీ లేదు, అవన్నీ రూమర్స్ మాత్రమే. ప్రస్తుతం నేను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీని నిర్మిస్తున్నాను” అని క్లారిటీ ఇచ్చారు.

కాగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం 2026 చివరికి మహేష్ తన కొత్త సినిమాకు సైన్ చేస్తారని తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా ఓ పాన్-ఇండియా దర్శకుడితోనే ఉంటుందని.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

Exit mobile version