సాయి తేజ్ ఉగ్రరూపం.. నెక్స్ట్ లెవెల్ విజువల్స్, టేకింగ్!

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రోహిత్ కేపి తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ చిత్రమే “సంబరాల ఏటి గట్టు”. అనౌన్సమెంట్ నుంచే సాలిడ్ హైప్ సొంతం చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ నేడు సాయి తేజ్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన సాలిడ్ గ్లింప్స్ ఇప్పుడు అదిరే లెవెల్లో ఉందని చెప్పాలి.

మరి ఈ సినిమా గ్లింప్స్ లో మాత్రం సాయి తేజ్ తన ఉగ్రరూపం చూపించాడని చెప్పాలి. బీస్ట్ మోడ్ లో దర్శకుడు అతన్ని ప్రెజెంట్ చేస్తే తనపై చూపించిన ప్రతీ షాట్ తాలూకా టేకింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పి తీరాలి. అంతే కాకుండా సినిమాకి పెట్టిన ఖర్చు కూడా భారీ విజువల్స్ తో సాలిడ్ గా కనిపిస్తుంది.

దీనితో ఈ గ్లింప్స్ తో మాత్రం అంచనాలు మరింత ఎక్కువ అవ్వడమే కాకుండా సాయి తేజ్ నుంచి ఓ నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ఇది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా తన స్కోర్ కూడా ఇందులో అదిరింది. అలాగే ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణ విలువలు కూడా ఈ సినిమాలో గట్టిగానే కనిపిస్తున్నాయి.

Exit mobile version