‘తెలుసు కదా’లో తనపాత్ర పై సిద్ధు హైప్..!

Siddu-Jonnalagadda

స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ చిత్రం ‘తెలుసు కదా’ దీపావళి కానుకగా ఈ నెల 17న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు మేకర్స్.

ఈ ఈవెంట్‌లో సిద్ధు జొన్నలగడ్డ తాను చేసిన వరుణ్ పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని.. సినిమాలో తన క్యారెక్టర్ ఒక్క చుక్క రక్తం చిందించకుండా ఎమోషనల్ వార్, సైకలాజికల్ వైలెన్స్‌ని సృష్టిస్తాడని.. ఇది తన ప్రామిస్ అంటూ చెప్పుకొచ్చాడు.

సిద్ధు చేసిన ఈ కామెంట్స్‌తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. నీరజా కోన డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version