నిర్మాత రామ్ తాళ్లూరికి జనసేన పార్టీ కొత్త బాధ్యతలు

Pawan-Kalyan

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీ నిర్మాణ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి(జనరల్ సెక్రటరీ)గా నియమితులయ్యారు.

రామ్ తాళ్లూరి తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఈ విషయాన్ని పంచుకున్నారు. “జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినందుకు పవన్ కళ్యాణ్ సర్‌కు ధన్యవాదాలు. నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. మీ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసేందుకు, ప్రజల కోసం శ్రమిస్తాను” అని పేర్కొన్నారు.

రామ్ తాళ్లూరి గతంలో కూడా జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ అభివృద్ధికి సహకరించారు. ఆయన నియామకం జనసేన బలోపేతానికి, భవిష్యత్ వ్యూహాత్మక కార్యక్రమాలకు దోహదం చేస్తుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Exit mobile version