‘పెద్ది’ నెక్స్ట్ అప్డేట్ ఇదే.. ఇరగ్గొట్టేశాడంటున్న బుచ్చిబాబు..!

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రం ‘పెద్ది’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.

అయితే, ఈ సినిమా నుంచి రాబోతున్న నెక్స్ట్ అప్డేట్ ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు తాజాగా ఓ క్లారిటీ ఇచ్చాడు. పెద్ది చిత్రం నుంచి నెక్స్ట్ రాబోతున్న అప్డేట్ ఓ లవ్ సాంగ్ అని.. దీనికోసం ఏఆర్ రెహమాన్ అత్యద్భుతమైన ట్యూన్స్‌తో ఇరగ్గొట్టేశాడని ఆయన అన్నారు. ఈ సాంగ్ కోసం తాను కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తుండగా అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా 2026 మార్చి 26న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు.

Exit mobile version