బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘‘మిత్ర మండలి’ ప్రీమియర్లకు మంచి స్పందన వస్తోంది. డిమాండ్ పెరుగుతుండటంతో స్క్రీన్లను పెంచుకుంటూ వెళ్తున్నాం. సెకండ్ షోలకి కూడా డిమాండ్ పెరిగింది. విజయవాడ, వైజాగ్‌లోనూ ప్రీమియర్లకు డిమాండ్ పెరిగింది. ప్రీమియర్లతో వచ్చే మౌత్ టాక్‌తో మరింత ప్రయోజనం చేకూరుతుందని మేం భావిస్తున్నాం. దీపావళి పండుగ 21 అయితే.. నవ్వుల పండుగ మాత్రం మా ప్రీమియర్లతో స్టార్ట్ అవుతుంది. అందరూ ఫ్యామిలీతో సినిమాకు రండి.. అందర్ని హాయిగా నవ్వించి బయటకు పంపిస్తాం. మనస్పూర్తిగా నవ్విస్తామని మాత్రం చెప్పగలను. ఈ మూవీ కోసం పని చేసిన నా టీంకు థాంక్స్.’ అని అన్నారు.
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘‘మిత్ర మండలి’ అందరినీ నవ్వించేలా ఉంటుంది. మీమర్స్, ఆడియెన్స్‌కి చాలా కంటెంట్ ఇస్తాం. ఓ కొత్త కంటెంట్‌తో అందరి ముందుకు రాబోతోన్నాం. ఇక ఇందులో నేను డ్యాన్స్ మూమెంట్స్ కూడా చేయాల్సి వచ్చింది. ఇందులో మేం ఏం చేసినా కూడా సినిమా, స్క్రిప్ట్‌కు తగ్గట్టే ఉంటుంది. బన్నీ వాస్ గారు ఎప్పుడూ సినిమా కోసం తపిస్తూనే ఉంటారు. పది రోజుల నుంచి నిద్ర లేకుండా ఈ మూవీ కోసం పని చేస్తున్నారు. బన్నీ వాస్ గారిని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఈ మూవీకి అసలు సిసలు హీరో ఆయనే’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ నిహారిక ఎన్ఎం, దర్శకుడు విజయేందర్ కూడా పాల్గొని మాట్లాడారు.