ఎన్. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్?

ఎన్. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్?

Published on Feb 17, 2013 2:28 PM IST

Kamal-Hasaan-Shankar

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రతి సినిమాలోనూ నటుడిగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాడు. అలాంటి కమల్ తో విప్లవాత్మక, వాస్తవాల ఆధారంగా సినిమాలు తీసే తెలుగు డైరెక్టర్ ఎన్. శంకర్ ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్ శంకర్ చెప్పిన కథ నచ్చడంతో కమల్ ఈ సినిమాకి పచ్చజెండా ఊపారని, అలాగే ప్రస్తుతం మన సొసైటీలో జరుగున్న అంశాలకి కమర్షియల్ హంగులని జత చేసి ఈ సినిమా చేయనున్నారని సమాచారం. ఈ సినిమా ఫై అధికారికంగా ఇంకా ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు.

కమల హాసన్ ప్రస్తుతం విశ్వరూపం సీక్వెల్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు, అలాగే ఓ హాలీవుడ్ సినిమాలో నటించడానికి అంగీకారం తెలిపారు. కమల్ ఎన్. శంకర్ తో చేసే సినిమా ఉందా? లేదా? అనే దాని కోసం మరి కొంత కాలం వేచి చూడాల్సిందే..

తాజా వార్తలు