టాలీవుడ్ అగ్ర దర్శకులలో ఒకడైన ఎస్. ఎస్ రాజమౌళి ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నాడు. ఈ వారం మొదట్లో తన కొత్త సినిమా “బాహుబలి” లోకేషన్లు వెతకడం కోసం కర్ణాటక మరియు కేరళ వెళ్ళిన తను మరిన్ని ప్రదేశాల కోసం రాజస్తాన్ వెళ్ళాడు. ఈ టూర్లో ఉండగా ” ‘మగధీర’ సినిమాకు లొకేషన్ల వేటకు వొచ్చినప్పటి జ్ఞాపకాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి.అప్పుడు చాల ఎంజాయ్ చేసాము…” అని ట్విట్టర్లో పేర్కొన్నాడు.
ప్రభాస్, రానా మరియు అనుష్క నటిస్తున్న ఈ చిత్రం చారిత్రాత్మక నేపధ్యం ఉన్న యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ప్రభాస్, రానా పూర్తిగా కొత్త వేషదారణలో కనిపించనున్నారు. వీరు ఇప్పటికే కత్తి పోరాటాలు, గుర్రపు స్వారిల మీద శిక్షణ తీసుకుంటున్నారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సబు సైరిల్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.కె.రాఘవేంద్ర రావు సమర్పణలో అర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ – ప్రసాద్ దేవినేని నిర్మింస్తున్న ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని అనుకుంటున్నారు.