టాలెంటెడ్ నటి అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియడ్ సినిమా ‘రుద్రమదేవి’ సినిమాని త్వరలో ఆదిలాబాద్ లో షూట్ చేయనున్నారు. డైరెక్టర్ గుణశేఖర్ కాకతీయ రాజ్యాన్ని పరిపాలించిన పవర్ఫుల్ లేడీ రాణి రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అనుష్క రాణి రుద్రమదేవి పాత్రలో కనిపించనుండగా రానా దగ్గుబాటి రుద్రమదేవి భర్త పాత్రలో కనిపించనున్నాడు.
ఇటీవలే ఓ షెడ్యూల్ ప్రారంభమైంది. త్వరలోనే ఈ చిత్ర టీం ఆదిలాబాద్ జిల్లాలోని కుంతల వాటర్ ఫాల్స్ దగ్గర కొన్ని కీలకమైన సీక్వెన్స్ లను చిత్రీకరించనున్నారు. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఓ స్పెషల్ సెట్ ని నిర్మిస్తున్నారు. తరువాత ఈ సెట్ కి గ్రాఫిక్స్ లో కొన్ని మెరుగులు దిద్దనున్నారు. ఈ సినిమా పూర్తి షూటింగ్ 2014 మార్చికల్లా పూర్తి కానుంది.
ఇండియాలోనే వస్తున్నా మొట్ట మొదటి హిస్టారికల్ 3డి సినిమా రుద్రమదేవి. గుణశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టాడు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. తోట తరుణీ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ సినిమాలో కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్ నిత్యా మీనన్, కేథరిన్, బాబా సెహగల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.