ఆర్ఆర్ఆర్ చిత్రీకరణలో మిగిలింది వారితో సన్నివేశాలే.

ఆర్ఆర్ఆర్ చిత్రీకరణలో మిగిలింది వారితో సన్నివేశాలే.

Published on Apr 16, 2020 9:25 AM IST

లాక్ డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ లేటవుతుందంటూ మాధ్యమాలలో వినిపిస్తున్నప్పటికీ అదేమీ జరగదని తెలుస్తుంది. 2020 జులై 30 నుండి 2021 జనవరి 8కి ఈ మూవీ విడుదల వాయిదాపడగా, ఈ కొత్త విడుదల తేదీకి కూడా రావడం కష్టమే అంటున్నారు. లాక్ డౌన్ ప్రకటించి నెలైపోతుంది. సమీప కాలంలో సాధారణ పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపించని తరుణంలో అందరికి ఈ అనుమానాలు వస్తున్నాయి. ఐతే ఆర్ ఆర్ ఆర్ అనుకున్న సమయానికే రానుందట.

ఈ చిత్ర షూటింగ్ 80 శాతానికి పైగా పూర్తయిందని సమాచారం. అలాగే ఆర్ ఆర్ ఆర్ టీం ఇప్పటివరకు పూర్తయిన సన్నివేశాల వి ఎఫ్ ఎక్స్ వర్క్ పూర్తి చేస్తున్నారట. కేవలం ఎన్టీఆర్, చరణ్ లకు సంబందించిన హీరోయిన్ కాంబినేషన్ సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలివుందని తెలుస్తుంది. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ విడుదల మరలా వాయిదా పడనీయం అని ఆర్ ఆర్ ఆర్ టీం గట్టిగా చెవుతుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, చరణ్ అల్లూరి పాత్ర ను చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు