“RRR” ఖచ్చితంగా అలాంటి సినిమా కాదు..!


ఇప్పుడు మరోసారి ఇండియా మొత్తం తెలుగు సినిమా కోసమే చర్చ నడుస్తుంది. ఎందుకంటే దర్శక ధీరుడు రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారింగ్ పీరియాడిక్ డ్రామా “రౌద్రం రణం రుధిరం”. పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం ఒక్క తారక్ మరియు చరణ్ అభిమానులే కాకుండా మొత్తం దేశం అంతా ఎంతగానో ఎదురు చూస్తుంది.

ఈ నేపథ్యంలో RRR యూనిట్ షూట్ ను పునః ప్రారంభం అయిన సందర్భంగా తారక్ టీజర్ ను రివీల్ చేస్తామని అలాగే ఇటీవలే దర్శకుడు రాజమౌళి పుట్టినరోజు కావడంతో ఆ హడావుడి అలా కొనసాగుతుంది. అయితే ఈ చిత్రంలో తారక్ మరియు రామ్ చరణ్ లు కొమరం భీం మరియు అల్లూరి సీతారామరాజులుగా కనిపించనున్నారని తెలిసిందే.

దీనితో ఈ చిత్రం స్వాతంత్య్ర యుద్ధ నేపథ్యంలో ఉంటుంది అని అంతా అనుకున్నారు. కానీ రాజమౌళి మొదట్లోనే ఈ చిత్రం మరో స్థాయిలో ఉంటుంది అని తెలిపారు. ఇపుడు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ ఇద్దరు పాత్రలు చిత్రంలో కలుస్తారు కానీ స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన సినిమా అయితే ఇది కాదని ఖచ్చితంగా తేల్చి చెప్పేసారు. సో ఈ భారీ చిత్రం ఊహించని రేంజ్ లోనే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Exit mobile version