ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో “రౌద్రం రణం రుధిరం” అనే బిగ్గెస్ట్ పీరియాడిక్ పాన్ ఇండియన్ చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా తాలూకా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించేయడంతో అప్పటికి తగ్గ ప్లానింగులు కూడా జరుగుతున్నాయి. సరే ఇదంతా బాగానే ఉన్నా ఈ చిత్రానికి సంబంధించి లీకులు మాత్రం ఆగడం లేదు.
ఆ మధ్య బాగానే కట్టడి చేసిన ఈ నెలనాళ్ళ మధ్యలోనే రెండు మూడు లీక్స్ బయటకు రావడం ఆశ్చర్యకరం. ఓసారి ఫోటో బయటకు రాగా ఈసారి ఏకంగా యాక్షన్ సీక్వెన్స్ వీడియోనే వచ్చేసినట్టు తెలుస్తుంది. దీనితో ఈ లీకులు ఎందుకు ఆగడం లేదని ఎన్నో ఏళ్ళు ఎంతో మంది కష్టంతో ఈ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు.
అలాంటప్పుడు ఎందుకు సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారని “RRR” కు ఈ సినిమా ఫ్యాన్స్ ఆ చిత్ర యూనిట్ కు సోషల్ మీడియాలో మొర పెట్టుకుంటున్నారు. అయితే ఈ లీక్స్ లో అధికంగా ఎన్టీఆర్ మీదవే ఉండడంతో తారక్ అభిమానులు మరింత హర్ట్ అవుతున్నారు. మరి ఇక నుంచి అయినా సరే మేకర్స్ ఇలాంటివి జరగకుండా చూసుకుంటారేమో చూడాలి.