ఆర్పీ పట్నాయక్ కి పితృ వియోగం

ఆర్పీ పట్నాయక్ కి పితృ వియోగం

Published on Oct 10, 2012 2:03 AM IST


ప్రముఖ సంగీత దర్శకుడు మరియు దర్శకుడు అయిన ఆర్పీ పట్నాయక్ పితృ వియోగానికి గురయ్యారు. గత కొంతకాలంగా నోటి కాన్సర్ తో బాధపడుతున్న ఆర్పీ పట్నాయక్ తండ్రి జానకేశ్వర రావు గారు మంగళవారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా పనిచేసిన ఈయనకు ముగ్గురు కుమారులు. ఇటీవలే “కెరటం” చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతం పట్నాయక్ ఈయన పెద్ద కుమారుడు రెండవ కుమారుడు ఆర్పీ పట్నాయక్ అటు సంగీత దర్శకుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. మూడవ కుమారుడు చంద్రమౌళి హైదరాబాద్లో సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు . ఈరోజు జానకేశ్వర రావు గారి భౌతిక కాయానికి అంత్యక్రియలు హైదరాబాద్లో జరిగాయి. పలువురు పరిశ్రమ పెద్దలు ఆర్పీ పట్నాయక్ ని పరామర్శించారు.

తాజా వార్తలు