విడుదలయిన రొటీన్ లవ్ స్టొరీ ఫస్ట్ లుక్

విడుదలయిన రొటీన్ లవ్ స్టొరీ ఫస్ట్ లుక్

Published on Oct 2, 2012 2:17 AM IST


సందీప్ కిష్ణన్ మరియు రెజినా ప్రధాన పాత్రలలో రాబోతున్న చిత్రం “రొటీన్ లవ్ స్టొరీ”. ఈరోజు ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ని హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చాణక్య నిర్మిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు,సందీప్ కిష్ణన్, రెజినా, మిక్కి జే మేయర్ మరియు తాప్సీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తాపసీ ఈ చిత్రం యొక్క ట్రైలర్ విడుదల చేసింది ఈ చిత్రం గురించి ప్రవీణ్ మాట్లాడుతూ ” ప్రతి ప్రేమ కథ విభిన్నంగా ఉంటుంది కాని వినేవారికి అది చాలా రొటీన్ గా అనిపిస్తుంది కలిసినప్పటి నుండి ఒక జంట ఎదురుకునే సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం ఇది” అని అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.మిక్కి జే మేయర్ అందించిన సంగీతం మరో రెండు వారాల్లో విడుదల కానుంది. ఈ చిత్రం కోసం దొరికే స్క్రీన్స్ బట్టి అక్టోబర్ 26న కాని నవంబర్ 9న కాని విడుదల కానుంది.

రొటీన్ లవ్ స్టొరీ ఫస్ట్ లుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు