సెన్సార్ పూర్తి చేసుకున్న రొటీన్ లవ్ స్టొరీ

సెన్సార్ పూర్తి చేసుకున్న రొటీన్ లవ్ స్టొరీ

Published on Nov 17, 2012 6:48 PM IST

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రానున్న “రొటీన్ లవ్ స్టొరీ” చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఒక్క కట్ లేకుండా యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ చిత్రం నవంబర్ 23న విడుదల అవ్వడానికి అన్ని అడ్డంకులు తీరిపోయినట్టే. సందీప్ కిషన్ మరియు రెజినా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాదిస్తుందని ప్రవీణ్ సత్తారు ధీమాగా ఉన్నారు. రేపటి నుండి ఈ చిత్రం ప్రచారం కోసం రాష్ట్రమంతటా ప్రయాణించనున్నారు మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సురేష్ భార్గవ సినిమాటోగ్రఫీ అందించారు. చాణక్య బూనేటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

తాజా వార్తలు