రొటీన్ లవ్.. సీడెడ్ రైట్స్ దక్కించుకున్న శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్

రొటీన్ లవ్.. సీడెడ్ రైట్స్ దక్కించుకున్న శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్

Published on Nov 20, 2012 11:35 AM IST


సందీప్ కిషన్ మరియు రెజీనా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘రొటీన్ లవ్ స్టొరీ’ నవంబర్ 23న విడుదలకు సిద్దమవుతోంది. అలాగే ఈ సినిమా సీడెడ్లో భారీగా విడుదల కానుంది. గతంలో ‘గబ్బర్ సింగ్’ మరియు ‘ఇష్క్’ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ వారే ఈ సినిమాని సీడెడ్లో
డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కొత్త రకమైన టైటిల్ మరియు ప్రత్యేకమైన ప్రమోషన్స్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి నెలకొంది. గతంలో వచ్చిన ‘ఎల్ బి డబ్ల్యూ’ సినిమా తీసిన ప్రవీణ్ సత్తారు ఈ మూవీకి డైరెక్టర్. చాణక్య. బి నిర్మించిన ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు.

తాజా వార్తలు