సమీక్ష : ది 100 – ఫర్వాలేదనపించే క్రైమ్ డ్రామా

సమీక్ష : ది 100 – ఫర్వాలేదనపించే క్రైమ్ డ్రామా

Published on Jul 10, 2025 8:04 PM IST

The 100 Telugu Movie Review

విడుదల తేదీ : జూలై 11, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : ఆర్ కె సాగర్, మిషా నారంగ్, విష్ణు ప్రియ, ధన్య బాలకృష్ణ, తారక్ పొన్నప్ప, ఆనంద్, కళ్యాణి నటరాజన్, వంశీ నెక్కంటి, వివి గిరిధర్, టెంపర్ వంశీ తదితరులు
దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్
నిర్మాత : రమేష్ కరుటూరి, వెంకీ పుషదపు, జె.తారక్ రామ్
సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫీ : శ్యామ్ కే నాయుడు
ఎడిటర్ : అమర్ రెడ్డి కుడుముల

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

‘మొగలిరేకులు’ టీవీ సీరియల్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆర్ కె సాగర్, ఇప్పుడు వెండితెరపై ‘ది 100’ సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
విక్రాంత్ (ఆర్ కె సాగర్) కొత్తగా అపాయింట్ అయిన ఐపిఎస్ ఆఫీసర్. వరుసగా జరుగుతున్న దోపిడీలు, హత్యలకు సంబంధించిన కేసును ఆయన టేకప్ చేస్తారు. అయితే, ఈ నేరాలు అన్నీ ఒకే విధంగా జరుగుతుండటం ఆయన గమనిస్తాడు. కానీ, ఆర్తి(మిషా నారంగ్) ఈ నేరాలకు బాధితురాలిగా మారడంతో ఈ కేసును పర్సనల్‌గా తీసుకుంటాడు విక్రాంత్. ఈ నేరాల వెనుక ఏదో పవర్‌ఫుల్ శక్తులు ఉన్నట్లు ఆయన గ్రహిస్తాడు. ఇక ఈ కేసుతో సంబంధం ఉన్న మధు(విష్ణు ప్రియ) రాకతో ఇవి మరింత కఠినంగా మారుతాయి. అసలు ఈ మధు ఎవరు..? ఈ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం ఉంది..? ఈ కేసును పరిష్కరించడంలో విక్రాంత్‌కు ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
ఆర్ కె సాగర్ లీడ్ రోడ్‌లో సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. ముఖ్యంగా యాక్షన్, ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లో ఆయన మెప్పిస్తాడు. ఆయన తన పాత్రను చాలా ఈజ్ తో చేశారు.

మిషా నారంగ్ డీసెంట్‌గా కనిపించింది. తన పాత్రకు ఆమె చక్కటి న్యాయం చేసింది. విష్ణు ప్రియ, ధన్య బాలకృష్ణ తమ పాత్రలతో ఆకట్టుకుంటారు. సెకండాఫ్‌లో వీరి పాత్రలు మెప్పిస్తాయి. తారక్ పొన్నప్ప తన పాత్ర మేర మెప్పించారు.

కథలో మంచి విషయం ఉన్నట్లు అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ సీన్స్‌ని కూడా కొంతవరకు బాగానే హ్యాండిల్ చేశారు. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ట్విస్టులు కథను ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాయి.

మైనస్ పాయింట్స్ :
ఈ చిత్ర పేస్ ఈ సినిమాకు మేజర్ డ్రాబ్యాక్‌గా నిలిచింది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండింటిలోనూ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉండటం, కథలో ఉండాల్సిన టెన్షన్‌ను త్వరగా ముగించేయడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. క్రిస్పీ నెరేషన్ ఉండి ఉంటే ఈ సినిమాకు మరికొంత హెల్ప్ అయ్యేది.

కొన్ని సీన్స్ ఆర్టిఫీషియల్‌గా అనిపిస్తాయి. సినిమాలో వచ్చే రొమాంటిక్ సాంగ్ సినిమా ఫ్లోకు పెద్ద అడ్డంకిగా మారిందని చెప్పాలి. దీంతో దీనిని అసందర్భంగా పెట్టారని అనిపిస్తుంది. కొన్ని సీన్స్‌లో ఎమోషనల్ టచ్ ఉన్నా వాటిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మెప్పించదు.

సినిమాలోని నటీనటుల విషయంలో మరి కాస్త జాగ్రత్త పడాల్సింది. ముఖ్యంగా నెగిటివ్ పాత్రల విషయంలో మెరుగైన యాక్టర్స్ ని తీసుకోవాల్సింది. క్లైమాక్స్‌లో ఓ చక్కటి సందేశాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించినా, దాన్ని రొటీన్‌గానే ముగించేశారు.

సాంకేతిక విభాగం :
దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ చక్కటి కాన్సెప్ట్‌ను ఎంచుకున్నా, దాన్ని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. స్క్రీన్ ప్లే పక్కాగా ఉండి ఉంటే, ఈ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. హర్షవర్ధన్ రామేశ్వర్ బీజీఎం డీసెంట్‌గా ఉంది. ఒక పాట ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. అమర్ రెడ్డి కుడుముల ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు. కొన్ని సీన్స్‌ను ట్రిమ్ చేసి ఉండాల్సింది. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ డీసెంట్‌గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే.. ‘ది 100’ చిత్రం క్రైమ్ యాక్షన్ డ్రామాగా కొంతవరకు ఆకట్టుకుంటుంది. ఆర్ కె సాగర్ తన నటనతో ఆకట్టుకుంటాడు. సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నా.. ఊహించగలిగే కథనం, స్లో పేస్, గ్రిప్పింగ్ సీన్స్ లేకపోవడం వంటి అంశాలు మైనస్. కాప్ డ్రామాలను ఇష్టపడేవారు తక్కువ అంచనాలతో ఈ సినిమాను చూడవచ్చు

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు