అందాల భామ కీర్తి సురేష్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. పెళ్లి తర్వాత ఆమె సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇక ఆమె నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రివాల్వర్ రీటా’ నవంబర్ 28న రిలీజ్‌కు రెడీ అయింది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా కీర్తి సురేష్ ఈ సినిమాతో పాటు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల గురించి కూడా మాట్లాడింది.
తెలుగులో దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కించబోతున్న చిత్రం ‘ఎల్లమ్మ’లో హీరోగా తొలుత నానిని అనుకున్నారని, ఆ తర్వాత నితిన్ ఓకే చేశాడని తెలిసిందే. కానీ, రీసెంట్‌గా నితిన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో దేవిశ్రీ ప్రసాద్ ఇందులో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక హీరోయిన్‌గా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుందనే టాక్ జోరందుకుంది.
అయితే, తాజాగా ఈ విషయంపై మాట్లాడుతూ తాను ఈ సినిమాలో చేయడం లేదని కీర్తి సురేష్ తేల్చి చెప్పింది. దీంతో ఎల్లమ్మ లాంటి తెలంగాణ నేపథ్యంలో సాగే సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.


