రియా లాగిన తీగతో వారిలో మొదలైన ఫీవర్?

రియా లాగిన తీగతో వారిలో మొదలైన ఫీవర్?

Published on Sep 12, 2020 11:07 AM IST

తీగ లాగితే డొంకంతా కదిలినట్టు అనే సామెత చాలా మందికే తెలుసు. ఇపుడు అలాంటి పరిస్థితే ఒకామె వల్ల కలిగేలా ఉంది. గత కొన్నాళ్ల నుంచి మన దేశంలోనే పెద్ద ఎత్తున వినిపిస్తున్న పేరు రియా చక్రవర్తి. ఇపుడు ఈమె తీగను పట్టుకొని లాగితే ఎక్కడెక్కడో డొంక కదులుతుంది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యా ఘటనలో మన టాలీవుడ్ లో కూడా గట్టిగా వినిపించిన ఈమె పేరు అక్కడ నుంచి దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.కానీ ఈ అంశం కంటే ముందే డ్రగ్స్ కేస్ విషయంలో ఈమె గత కొన్ని రోజుల కితం అరెస్టయిన ఘటన పెద్ద కలకలం రేపింది.

అయితే ఆ సమయంలో ఈమె నుంచి చాలా పెద్ద వ్యక్తుల పేర్లే ఈ కేసు విషయంలో రావచ్చని ఎన్ సి బి అధికారులు తెలియజేసారు. ఇపుడు లేటెస్ట్ గా అందుకు తగ్గట్టుగానే ఈమె పలువురు బాగా తెలిసిన వ్యక్తుల పేర్లనే బయట పెట్టడంతో సరికొత్త ట్విస్ట్ ఏర్పడింది.

అందులో మన టాలీవుడ్ కు చెందిన వారి పేరు కూడా చెప్పిందని తెలియడంతో మరికొందరు పేర్లు కూడా వస్తాయేమో అని కొందరు భయం ఫీల్ అవుతున్నారని, దీనితో రియా క్లోజ్ గా ఉన్న ఇంకా కొంతమంది పేర్లు కూడా బయటకు వస్తాయని టాక్ అప్పుడే మొదలయ్యిపోయింది. దీనితో రియా లాగిన తీగ ఇంకా ఎంత మందిని కదిలిస్తుందో చూడాలి మరి.

తాజా వార్తలు