తెలుగులో “బూచి”గా రాబోతోనున్న రాంగోపాల్ వర్మ “భూత్ రిటర్న్స్”

తెలుగులో “బూచి”గా రాబోతోనున్న రాంగోపాల్ వర్మ “భూత్ రిటర్న్స్”

Published on Sep 30, 2012 4:00 AM IST


రామ్ గోపాల్ వర్మ రాబోతున్న చిత్రం “భూత్ రిటర్న్స్” చిత్రాన్ని తెలుగులో “బూచి” అనే పేరుతో విడుదల చెయ్యనున్నారు. ఈ చిత్రం 2003లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చి విజయం సాదించిన “భూత్” చిత్రానికి సీక్వెల్ ఈ చిత్రం. జే డి చక్రవర్తి, మనీషా కొయిరాల మరియు మధు శాలిని “భూత్ రిటర్న్స్” లో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మధ్యనే విడుదల చేసిన పోస్టర్లు చిత్రం మీద ఆసక్తిని పెంచాయి. జితేంద్ర జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈరోస్ ఇంటర్నేషనల్ వారు చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మనీషా కొయిరాల మరియు జే డి చక్రవర్తి చాలా రోజుల తరువాత తెర మీద కనిపిస్తుండటంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 12న “భూత్ రిటర్న్స్” చిత్రం 3డి లో విడుదల కానుంది. ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ అయిన “బూచి” చిత్రం అక్టోబర్ 26 విడుదల అవుతుంది.

తాజా వార్తలు