మరోసారి సింగర్ గా మారిన వర్మ

ram-gopal-varma
నిర్మాతగా దర్శకుడిగా సుపరిచితమైన రామ్ గోపాల్ వర్మ మరోసారి తన గళం విప్పనున్నాడు. ‘రక్త చరిత్ర’ లో మొదటిసారిగా పాట పాడిన అతను ‘ది అటాక్స్ ఆఫ్ 26/11′ తెలుగు వెర్షన్లో మరోసారి పాడనున్నాడు. ఈ సినిమా తెలుగు వెర్షన్ పేరు ’26/11 ఇండియాపై దాడి’ . ‘నెత్తుటి రుచి మరిగింది’ అంటూ సాగే ఈ గీతాన్ని ప్రచార గీతంగా వాడనున్నారు.

సంగీత దర్శకుడు అమర్ పాడమని వర్మని ఒప్పించాగా, అంతకన్నా అద్భుతంగా వర్మ పాడి తనని మెప్పించాడట. ఈ చిత్రం 2008లో జరిగిన ముంబాయి దాడుల నేపద్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆరోజు ప్రణాలు కోల్పోయినవారి జీవితాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది అన్నారు. నానా పటేకర్ పోలీస్ కమిషనర్ గా ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం హిందీ వెర్షన్ మార్చ్ 1న విడుదల కానుంది. తెలుగు వెర్షన్ కాస్త ఆలస్యంగా విడుదలకానుంది.

Exit mobile version