మనం పై ప్రశంశలు కురిపించిన వర్మ

మనం పై ప్రశంశలు కురిపించిన వర్మ

Published on Jan 26, 2014 11:30 AM IST

RGV
అక్కినేని హీరోలైన ఏఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్య కలిసి చేస్తున్న సినిమా ‘మనం’. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానుల్లో తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా జాయిన్ అయ్యాడు. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సమంత, శ్రియలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇందులో నటించిన ఏఎన్ఆర్ గత వారమే స్వర్గస్తులైనారు.

ఇటీవలే ఈ సినిమాకి సంబందించిన కొన్ని సీన్స్ చూడడం జరిగింది. అప్పటి నుండి ఈయన ఆ సినిమా గురించి ప్రశంశిస్తున్నాడు. ఈ మూవీ పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ‘ఇప్పుడే ఏఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్య చేసిన మనం సినిమా కొంత చూసాను. తెలుగు సినిమా ఒక స్థాయికి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మనం అనేది ఈ సినిమా యొక్క అసలైన ఫీలింగ్, ఇలాంటి సినిమాని చూసి చాలా కాలం అయ్యింది. విక్రమ్ టాలెంట్ ఉన్న డైరెక్టర్, ఇలాంటి డైరెక్టర్ ని కూడా నేను కత కొద్ది సంవత్సరాలుగా కలవలేదని’ వర్మ ట్వీట్ చేసాడు. అలాగే ‘ఈ సినిమా కోసం డిజైన్ చేసిన ఫోటోలలో ఏఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్య లుక్ చాలా కొత్తగా ఉంది. సినీ అభిమానులు విక్రమ్ కోసం ఈ సినిమాని చూడొచ్చని’ మరో ట్వీట్ చేసాడు.

ఈ సినిమా స్టొరీ లైన్ గురించి ఇంకా బయటకి చెప్పకపోయినా ఈ చిత్ర టీం మాత్రం సినిమా విషయంలో ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది.

తాజా వార్తలు