రామోజీ ఫిలిం సిటీ లో ప్రియ ఆనంద్ “రంగ్రీజ్”

రామోజీ ఫిలిం సిటీ లో ప్రియ ఆనంద్ “రంగ్రీజ్”

Published on Sep 27, 2012 9:12 AM IST


“లీడర్” చిత్రంతో తెలుగు తెరకుపరిచయమయిన భామ ప్రియ ఆనంద్ ఆ చిత్రంలో తన నటనతో ఆకట్టుకుంది. తరువాత పలు చిత్రాలు చేసినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.అయినా కూడా ఈ నాటికీ శ్రీదేవి తిరిగి తెర మీదకి వస్తున్న చిత్రం “ఇంగ్లీష్ వింగ్లిష్” లో నటించే అవకాశం రావడం ఆమె అదృష్టమనే చెప్పాలి ఈ చిత్రం తెలుగు,తమిళం మరియు హిందీ లో విడుధలవుతున్డటం. తెలుగు మరియు తమిళంలో ప్రియ ఆనంద్ మంచి నటిగా గుర్తింపు ఉండటం అటు చిత్రానికి ఇటు ఆమెకు మంచి సహకారం అందిస్తుంది. ఇప్పుడు ఆమె బాలివుడ్ లో మరో చిత్రం చేస్తుంది “రంగ్రీజ్” అనే ఈ చిత్రం తమిళంలో విడుదలయి విజయం సాదించిన “నాడోడిగల్ ” చిత్రానికి రీమేక్. ఇదే చిత్రాన్ని తెలుగులో రవితేజ, ప్రియమణి ప్రధాన పాత్రలలో “శంభో శివ శంభో” చిత్రంగా మలచారు. ప్రస్తుతం “రంగ్రీజ్” చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో జరుపుకుంటుంది. ఇక్కడ ఒక పాటని చిత్రీకరిస్తున్నారు . జాకి భాగ్నాని కథానాయకుడిగా కనిపిస్తున్న ఈ చిత్రానికి ప్రియ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. వశు భాగ్నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు