చివరి షెడ్యూల్ లో రేయ్

చివరి షెడ్యూల్ లో రేయ్

Published on Oct 12, 2012 11:00 AM IST


వై వి ఎస్ దర్శకత్వంలో రానున్న చిత్రం “రేయ్” చివరి దశల్లో ఉంది. ఈ చిత్రం గత ఏడాదిగా జరుపుకుంటుంది గత కొన్ని నెలలుగా ఈ చిత్రం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటూ వస్తుంది, హైదరాబాద్ కాకుండా ఈ చిత్రం న్యూయార్క్ , శాన్ ఫ్రాన్సిస్కో , లాస్ ఏంజల్స్ మరియు ట్రినిడాడ్ & టొబాగో వంటి నగరాల్లో ఈ చిత్రం చిత్రీకరణ జరిగింది. ప్రస్తుతం ఈ చిత్ర చివరి షెడ్యూల్ బ్యాంకాక్లో జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. చిరంజీవి అల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కానున్నారు. సయామీ ఖేర్ ఈ చిత్రంతో కథానాయికగా పరిచయం కానుంది. శ్రద్ద దాస్ ఈ చిత్రంలో ముఖ్య భూమిక పోషించనుంది. మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ మరియు సయామీ ఖేర్ లు పాప సంగీత నృత్యకారులుగా కనిపించనున్నారు. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వై వి ఎస్ చౌదరి స్వయంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రం 2013 జనవరిలో విడుదల కానుంది.

తాజా వార్తలు