రేణు దేశాయ్ కి మహేష్ బంపర్ ఆఫర్..?

రేణు దేశాయ్ కి మహేష్ బంపర్ ఆఫర్..?

Published on Jun 25, 2020 6:55 PM IST


సూపర్ స్టార్ మహేష్ హీరోయిన్ రేణు దేశాయ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆయన నిర్మిస్తున్న మూవీలో రేణు దేశాయ్ ఓ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. వివారాల్లోకి వెళితే..మహేష్ హీరో అడివి శేషుతో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. మేజర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం రేణు దేశాయ్ ని తీసుకున్నారట. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తుంది.

ఇక కొన్నాళ్లుగా రేణు దేశాయ్…సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఆమె ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాధ్ ని ఆయన చిత్రంలో ఓ రోల్ ఇవ్వాలని కోరారు. అలాగే మహేష్ బాబు చిత్రంలో కూడా నటించాలని ఉందని…రేణు తన కోరిక బయటపెట్టారు. 2000లో వచ్చిన బద్రి సినిమాతో వెండితెరకు పరిచయమైన రేణు.. ఓ తమిళ చిత్రం మరియు జానీ చిత్రాలలో నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు