మెగాస్టార్ తో టాలెంటెడ్ హీరోయిన్ డాన్స్ ?

మెగాస్టార్ తో టాలెంటెడ్ హీరోయిన్ డాన్స్ ?

Published on Mar 9, 2020 6:19 PM IST

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ‘చిరు 152వ’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. ఇటివలే ఆ పాట‌ను షూట్ చేశారు. కాగా ఈ సాంగ్ గురించి రెజీనా మాట్లాడుతూ ‘నాకు డాన్స్ అంటే బాగా ఇష్టం. పైగా మెగాస్టార్ గారితో డాన్స్ అంటే.. అది గొప్ప లక్కీ ఛాన్సే. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు కొరటాల శివగారికి థాంక్స్‌. సిక్స్ డేస్ పాటు ఈ సాంగ్ ను చిత్రీక‌రించారు. ఇక చిరంజీవిగారి డాన్స్ చూసి చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. నా డాన్స్ చూసి ఆయన, నన్ను అభినందించారు. మెగా స్టార్ న‌న్ను అభినందించ‌డం చాలా ఆనందంగా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది రెజీనా.

ఇక మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారట. ఇప్పటికే మణిశర్మ ఈ చిత్రానికి ట్యూన్లను కూడా సిద్ధం చేశారు. ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది. మొత్తంగా చెప్పాలంటే మెగాస్టార్ – కొరటాల నుండి ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రానుంది.

తాజా వార్తలు