రెజీనా కొత్త లుక్ కి మంచి స్పందన వస్తోంది !

రెజీనా కొత్త లుక్ కి మంచి స్పందన వస్తోంది !

Published on Mar 4, 2020 9:38 AM IST

వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న హీరోయిన్ రెజీనా కసండ్ర ప్రధాన పాత్రలో నటిస్తోన్న మిస్టరీ థ్రిల్లర్ ‘నేనే నా..?’. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతుంది. న్యూ ఏజ్ ఫిలిమ్ మేక‌ర్‌గా తొలి చిత్రం నిను వీడ‌ని నీడ‌ను నేనే సినిమాతో సూప‌ర్‌హిట్ సాధించి తన ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న ద‌ర్శ‌కుడు కార్తీక్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

యాపిల్‌ ట్రీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నిర్మాత రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నిన్న విడుద‌ల చేశారు. ఇనుప చువ్వ‌ల మ‌ద్య బంధీగా ఉన్న మ‌హారాణి పాత్ర‌ధారిగా రెజీనా క‌సండ్ర లుక్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం నెటిజన్లను ఈ పోస్టర్ బాగా ఆకట్టుకుంటుంది. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న ఈ చిత్రంలో రెజీనా ఆర్కియాల‌జిస్ట్‌గా క‌న‌ప‌డ‌తారు. ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. సంగీతాన్ని.. పీకే వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు