ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. ఇటీవలే టీజర్ ను కూడా విడుదల చేసి మేకర్స్ మరిన్ని అంచనాలు పెంచారు. అయితే మరి ఈ భారీ బడ్జెట్ అండ్ మల్టీ స్టారర్ చిత్రం విడుదల తేదీ ప్రకటించినప్పటి నుంచి బిజినెస్ పనులు కూడా స్టార్ట్ అయ్యినట్టుగా తెలుస్తున్నాయి.
మరి లేటెస్ట్ టాక్ ప్రకారం ఆచార్యకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ పనుల్లో ఉందని తెలుస్తుంది. అంతే కాకుండా ఇప్పటికే ఏపీలో బిజినెస్ పూర్తి కాగా ఇంకా నైజాం హక్కుల విషయంలో చర్చలు జరుగుతున్నాయట. ఇలా ఓవరాల్ గా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్ల మేర బిజినెస్ ను లాక్ చేస్తుంది అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ భారీ చిత్రంలో చరణ్ ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.