రామోజీ ఫిలిం సిటీలో రెబల్

రామోజీ ఫిలిం సిటీలో రెబల్

Published on Apr 10, 2012 9:30 AM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. తమన్నా, ముఖేష్ రుషి మరియు ఇతర నటీ నటులపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కృష్ణరాజుపై సన్నివేశాలు ఇప్పటికే పూర్తి చేసారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జే. భగవాన్ మరియు జే. పుల్లారావు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా మరియు దీక్షా సేథ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాల్సి ఉండగా అతను తప్పుకోవడంతో లారెన్స్ స్వయంగా సంగీతం అందిస్తున్నాడు. అతను గతంలో డాన్ అనే సినిమాకి కూడా సంగీతం అందించాడు.

తాజా వార్తలు