రెండవ రోజు కూడా నైజాంలో కలెక్షన్స్ అదరగొట్టిన ‘రెబల్’

రెండవ రోజు కూడా నైజాంలో కలెక్షన్స్ అదరగొట్టిన ‘రెబల్’

Published on Sep 30, 2012 6:20 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రెబల్’ చిత్రం అద్భుతమైన ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం మొదటి రోజు ఒక్క నైజాంలోనే 2 కోట్లా 10 లక్షలు కలెక్ట్ చేసిందని ఇదివరకే తెలిపాము. ఈ చిత్రం రెండవ రోజు సుమారు 1 కోటి 47 లక్షలు కలెక్ట్ చేసింది. మొదటి రెండు రోజుల్లో మొత్తం 3 కోట్లా 57 లక్షలు కలెక్ట్ చేసింది. ఈ చిత్రం మొదటి వారంలో సుమారు 8.5 కోట్ల నుంచి 9 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రోజు హైదరాబాద్లో తెలంగాణ మార్చ్ వల్ల థియేటర్లన్నీ మూత పడటంతో కలెక్షన్లు తగ్గుతాయని అందరూ భావిస్తున్నారు. సోమవారం కలెక్షన్లను బట్టి ఈ చిత్రం అదే కలెక్షన్స్ తో ముందుకెలుతుందా లేదా అనేది తెలుస్తుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని జె.భగవాన్ మరియు జె. పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు మరియు దీక్షా సేథ్ కీలక పాత్రలు పోషించారు.

తాజా వార్తలు