గోదావరి మరియు కృష్ణ జిల్లాలో భారీ ఓపెనింగ్స్ సాదించిన రెబల్

గోదావరి మరియు కృష్ణ జిల్లాలో భారీ ఓపెనింగ్స్ సాదించిన రెబల్

Published on Sep 29, 2012 3:49 PM IST

ప్రభాస్,తమన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన “రెబల్” చిత్రం రాష్ట్రమంతటా మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఈ శుక్రవారం విడుదలయిన ఈ చిత్రం నైజాంలో మొదటిరోజు 2.1 కోట్లు వసూలు సాదించాయి అని మేము ఇంతకముందే ప్రకటించాము. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఉభయ గోదావరి జిల్లాలు మరియు కృష్ణ జిల్లాలో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించింది. తాజా సమాచారం ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ చిత్రం 58 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 44 లక్షలు మరియు కృష్ణ జిల్లాలో ఈ చిత్రం 34 లక్షలు షేర్ ని వసూలు చేసింది. ప్రభాస్ చిత్రానికి ఇటువంటి సంఖ్యలు అద్భుతమనే చెప్పాలి. దీక్ష సెత్ మరియు కృష్ణం రాజు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జే భగవాన్ మరియు జే పుల్లారావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం కూడా లారెన్స్ అందించారు.

తాజా వార్తలు