సెన్సార్ పూర్తి చేసుకున్న ‘రెబల్’

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘రెబల్’

Published on Sep 24, 2012 7:48 PM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రెబల్’. ఈ చిత్రం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు మరియు మూడు సన్నివేశాల్లో చిన్న కట్స్ చేయమని చెప్పారు. పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నందువల్ల ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. బి మరియు సి ప్రేక్షకులను ఆకట్టుకునే మాస్ మసాలా డైలాగ్స్ ఉంటాయని మేము ఇదివరకే తెలియజేశాము. ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా తన గ్లామర్ మరియు డాన్సులతో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు మరియు దీక్షా సేథ్ మరో కథానాయికగా నటించారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. జె. పుల్లారావు మరియు జె. భగవాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు