IPL 2025 : పంజాబ్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం

IPL 2025 : పంజాబ్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం

Published on Apr 20, 2025 7:01 PM IST

ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. తొలుత టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్‌లో ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య (22), ప్రభ్సిమ్రన్ సింగ్ (33) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన జోష్ ఇంగ్లిస్(29), శశాంక్ సింగ్ (31 నాటౌట్), మార్కో జాన్సెన్(25 నాటౌట్) రాణించడంతో 157 పరుగుల స్కోర్‌ను పంజాబ్ చేయగలిగింది.

ఇక 158 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన బెంగళూరు తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. దీంతో విరాట్ కోహ్లీ(73 నాటౌట్) చెలరేగి ఆడగా, అతడికి తోడుగా దేవ్‌దత్ పడిక్కల్(61) అదరగొట్టాడు. దీంతో కేవలం 18.5 ఓవర్లలోనే బెంగళూరు 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి విజయాన్ని అందుకున్నారు. పంజాబ్‌పై బెంగళూరు 7 వికెట్ల తేడాతో గెలుపును అందుకున్నారు.

తాజా వార్తలు